Header Banner

సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు బిగ్.. ఆ కేసులో విచారణకు రావాల్సిందేనని ఆదేశం!

  Thu May 01, 2025 14:41        Entertainment

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2019 నాటి ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘన కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ను నిన్న సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, స్టే ఇవ్వాలని మోహన్‌బాబు చేసిన అభ్యర్థనను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. 2019 ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ మోహన్‌బాబు విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన ధర్నా కార్యక్రమం అప్పట్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న ఆరోపణలతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రేపు సంబంధిత విచారణ అధికారి ఎదుట మోహన్‌బాబు కచ్చితంగా హాజరు కావాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి: ప్రమాద స్థలిని పరిశీలించిన బొత్స బృందం! ఆలయ అధికారుల నుంచి వివరాలు..

 

ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ధర్నా జరిగిన సమయంలో మోహన్‌బాబు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నారా? అని ధర్మాసనం ఆయన తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. మోహన్‌బాబు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది, ఆయన 75 ఏళ్ల వయసున్న వారని, విద్యాసంస్థను నడుపుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదని వాదించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో చేసిన నిరసన కార్యక్రమం నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఛార్జిషీట్‌లో తమపై కోడ్ ఉల్లంఘన అభియోగాలు మోపారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting